29-09-2025 12:45:19 AM
ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
చిన్న చింతకుంట, సెప్టెంబర్ 28: మండలం చిన్న వడ్డేమాన్ గ్రామంలో ఏంబి మిస్పా సంఘం నూతన మందిర ప్రారంభోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపౌండ్ వాల్ నిర్మాణం కోసం రూ 5 లక్షల ప్రొసీడింగ్స్ అందజేశారు.
అనంతరం గ్రామంలో హైమాస్ట్ లైట్లను ప్ర ఎమ్మెల్యే జియంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ అందరి సంతోషం కోసమే మా తాపత్రయమని తెలిపారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ మీ ఎదుగుదలకు ఎల్లవేళల శ్రమిస్తానని తెలియజేశారు. ఈ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులుఉన్నారు.