calender_icon.png 3 November, 2025 | 11:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన యువత

03-11-2025 12:00:00 AM

నిర్మల్ నవంబర్ 2 (విజయక్రాంతి) : రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రజాపాలనను చూసి ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు అన్నారు. ఆదివారం లక్ష్మణచందా మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు నక్కల దినేష్, నాయిడి రవి ఆధ్వర్యంలో యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజా సమస్యలను పరిష్కరించే విధానాన్ని చూసి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు.

కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ అని అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, మండల అధ్యక్షులు వడ్నాల రాజేశ్వర్,, నగేష్, ఓసా రాజేశ్వర్ ప్రతాపరెడ్డి కల్లెడ భూమన్న, మైనారిటీ నాయకులు అస్గర్ ఆత్మ డైరెక్టర్‌లు, కిరణ్ ఠాకూర్,సమ్మెట రవి తదితరులు పాల్గొన్నారు.