17-12-2024 02:13:02 AM
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో 2024 అకాడమిక్ ఇయర్‌కు మొత్తం 1,913 పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమోదైందని ప్రభుత్వం తెలిపింది. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు సబితా ఇం ద్రారెడ్డి, హరీశ్‌రావు, అనిల్‌జాదవ్, సంజయ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్న లు అడిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయి?, అలాంటి వాటిని ఇతర పాఠశాలల్లో విలీనం చేశారా?, ఆ పాఠశాలల్లో తిరిగి విద్యార్థులను చేర్చిపించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సభ్యులు ప్రశ్నిం చారు.
దీనిపై స్పందించిన విద్యాశాఖ రాష్ట్రంలో 1,831 ప్రైమరీ, 49 అప్పర్ ప్రైమరీ, 33 ఉన్నత పాఠశాలల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్ నమో దైందని ప్రభుత్వం పేర్కొంది. వీటిని వేరే పాఠశాలల్లో విలీనం చేయలేదని సమాధానం ఇచ్చింది. జీరో ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టా మని, విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపింది. ఫలితంగా 79 పాఠశాలల్లో 612 మంది విద్యార్థులను తిరిగి చేరినట్టు విరించింది.