calender_icon.png 31 July, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా పరాజయం

28-10-2024 12:00:00 AM

కివీస్‌దే రెండో వన్డే మంధాన డకౌట్ 

అహ్మదాబాద్: భారత మహిళల జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 76 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది.

సోపీ డివైన్ (79) టాప్ స్కోరర్ కాగా.. సుజీ బేట్స్ (58) అర్థసెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 4 వికెట్లతో మెరిసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో లియా తాహుహు, సోఫీ డివైన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

ఓపెనర్ స్మృతి మంధాన డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచగా.. మిగతా బ్యాటర్లు రాణించడంలో విఫలమవ్వడంతో ఓటమి తప్పలేదు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిసిన సోఫీ డివైన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది.