calender_icon.png 6 July, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా నుండి రహదారికి విముక్తి కల్పించిన అధికారులు

05-07-2025 08:52:36 PM

కోదాడ: కబ్జా నుండి రహదారికి విముక్తి కల్పించిన సంఘటన మండల పరిధిలోని అల్వాల్ పురం గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఆశీర్వాదమ్మ అల్వాల్ పురం గ్రామపంచాయతీ పరిధిలో 315 సర్వే నెంబర్ లో నాలుగు ప్లాట్లను 2016లో కొని దానిలో అపార్ట్మెంట్ నిర్మించారు. దానికి వెళ్లే రహదారిని ఓ వ్యక్తి కబ్జా చేసినట్లు ఇటీవల జరిగిన గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో జిల్లా కలెక్టర్ స్పందించి మండల అధికారుల ను కార్యదర్శిని సమస్య పరిష్కరించమని ఆదేశించారు. దీంతో ఎంపీఓ పాండురంగన్న, కార్యదర్శి రమాదేవి, అనంతగిరి ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకుని జెసిబి, గ్రామపంచాయతీ సిబ్బంది సహాయంతో రహదారికి అడ్డంగా అమర్చిన తీగలను తొలగించి రహదారికి విముక్తి కల్పించారు. ఎటువంటి గొడవలు చోటు చేసుకోకుండా సమస్యను సానుకూలంగా పరిష్కరించారు.