calender_icon.png 6 July, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ స్టాంపులు.. ధ్రువపత్రాల తయారీ గుట్టురట్టు

05-07-2025 08:49:32 PM

తండ్రి కొడుకుపై కేసు నమోదు... 

వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ...

అదిలాబాద్,(విజయక్రాంతి): నకిలీ స్టాంప్ లు, నకిలీ ధ్రువపత్రాలను తయారీ చేసే ముఠా గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో తండ్రి కొడుకుల పై కేసు నమోదు చేయగా తండ్రిని అరెస్టు చేయాగ, కొడుకు పరారీలో ఉన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ లోని శాంతి నగర్ కు చెందిన లడ్వే రాహుల్ కుమార్ అనే యువకుడు ఇంట్లోనే నకిలీ సర్టిఫికెట్ తయారు చేయడం మొదలు పెట్టాడు.

తండ్రి లడ్వే బద్రీనాథ్ కు గతంలో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ అనుభవంతో ఇంటి వద్దనే రాహుల్ నకిలీ స్టాంపుల తయారీతో పాటు పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్, పంచాయతీ రాజ్, మున్సిపల్ కౌన్సిల్ లకు సంబంధించిన నకిలీ పత్రాలను తయారు చేస్తూ విక్రయించేవాడు. దీంతో పోలీసులకు అధించిన సమాచారం మేరకు నిందితుని ఇంట్లో సోదాలు చేపట్టగా ప్రభుత్వ పలు శాఖల నకిలీ పత్రాలు, స్టాంపులు, అధికారుల సంతకాల స్టాంపులు, కంప్యూటర్, ప్రింటర్ లను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఏ1 రాహుల్ పరారీలో ఉండగా అతని తండ్రి ఏ2 బద్రినాథ్ ను అరెస్టు చేశామన్నారు.