05-07-2025 09:06:57 PM
శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా నెక్సస్ సెలెక్ట్ మాల్స్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ పనులను శనివారం ఇరిగేషన్, రెవెన్యూ, జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. కైదమ్మకుంట చెరువు దశ,దిశ మారుతుందని, వర్షాకాలంలోపు పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ ప్రాజెక్ట్ కీలకమైన సహజ వనరులను పునరుజ్జీవింపచేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో సుస్థిరమైన అభివృద్ధి కోసం ఒక నమూనాను ఏర్పాటు చేస్తుందని అన్నారు. కైదమ్మ కుంట చెరువు శాశ్వత పరిష్కారం దిశగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డీఈ నళిని,ఏఈ పావని,రెవెన్యూ అధికారులు సర్వేయర్ జగదీష్, జలమండలి మేనేజర్ శ్రీహరి సిఎస్ఆర్ ఐటీ సంస్థ ప్రతినిధులు చైతన్య, రాము, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.