calender_icon.png 5 February, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_30085566.webp
తెలంగాణలో ట్యాక్స్ టెర్రరిజం

05-02-2026

హైదరాబాద్: 'సేవ్ తెంలగాణ-ఓట్ ఫర్ బీజేపీ'(Save Telangana Vote 4 BJP) అనే నినాదంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సేవ్ తెలంగాణ పేరుతో పాటను రామచందర్ రావు విడుదల చేశారు. ధనిక తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని రామచందర్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ఎన్ని స్కాములు చేసిందో కవతను అడిగితే చాలన్నారు. కాంగ్రెస్ స్కామ్ ల గురించి మంత్రులను అడగాలని తెలిపారు. ప్రజల ధనాన్ని కాంగ్రెస్ పాలకులు దోచుకుంటున్నారని రామచందర్ వెల్లడించారు. మున్సిపాల్టీలపై రూ. 3,600 కోట్ల అప్పు ఉందని వివరించారు. రాజకీయ మద్దతుతో మున్సిపాల్టీ అధికారులు పేదలను హింసిస్తున్నారని తెలిపారు. ఎంతమంది అవినీతి అధికారులపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.

article_79766332.webp
కోఠి ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కాల్పుల కలకలం

31-01-2026

హైదరాబాద్: శనివారం ఉదయం కోఠి ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) ప్రధాన శాఖ సమీపంలో కాల్పుల ఘటన జరగడంతో బ్యాంక్ స్ట్రీట్‌లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో రషీద్ అనే వ్యక్తి నగదు డిపాజిట్ చేయడానికి ఏటీఎం వద్దకు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. పోలీసుల ప్రకారం, దుండగులు రషీద్‌ను వెంబడించి కాల్పులు జరిపి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదుతో పారిపోయారు. రషీద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో, అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సుల్తాన్ బజార్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

article_88150475.webp
కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దుమీరుతుంది

30-01-2026

హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం హద్దులుమీరుతోందని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్వగ్రామం వీణవంకలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొనకుండా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిని పోలీసులు అకారణంగా నిర్బంధించడం, వారి కుటుంబసభ్యుల పట్ల దురుసుగా ప్రవర్తించడం రాష్ట్రంలో సాగుతున్న అరాచక, నిర్భంధ పాలనకు నిదర్శనమన్నారు. కౌశిక్ రెడ్డి మీద పోలీసుల దౌర్జన్యాన్ని కేటీఆర్ ఖండించారు. ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడే నాయకులను మీ నిర్బంధాలతో, అక్రమ కేసులతో భయపెట్టలేరని కేటీఆర్ పేర్కొన్నారు.

article_13260111.webp
విరిగిపడ్డ జెండా కర్ర.. మంత్రి తప్పిన ప్రమాదం

26-01-2026

నారాయణపేట: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మక్తల్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో జెండాస్తంభంలో కొంత భాగం కూలిపోవడంతో కాంగ్రెస్ నాయకుడు కె. నాగేందర్‌కు గాయాలయ్యాయి. అయితే పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సురక్షితంగా బయటపడ్డారు. వేడుకల కోసం మంత్రి, అధికారులు, స్థానిక నివాసితులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తహసీల్దార్ సతీష్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేస్తుండగా, జెండా స్తంభంలో కొంత భాగం విరిగి, అక్కడ గుమిగూడిన వారిపై పడిందని సమాచారం. దీని ఫలితంగా కాంగ్రెస్ నాయకుడు నాగేందర్ కాలికి గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే మక్తల్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మంత్రి శ్రీహరికి ఎలాంటి గాయాలు కాలేదని, త్రుటిలో తప్పిన ప్రమాదం అధికారులు తెలిపారు.