calender_icon.png 26 January, 2026 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాపుల ముందు డిస్కౌంట్ బోర్డ్‌ల తొలగింపు

26-01-2026 02:15:40 AM

మేడ్చల్ మల్కాజిగిరి కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

ఉప్పల్,జనవరి 25: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున కొన్ని చైన్ లింక్ మెడికల్ షాపుల ముందు డిస్కౌంట్ బోర్డులను ప్రదర్శిస్తు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి.

ఈ సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో డిస్కౌంట్ బోర్డులను తొలగించారు.డిస్కౌంట్ బోర్డుల వల్ల చిన్నచిన్న మెడికల్ షాపుల యజమానులు నష్టపోతున్నారని, ఇందులో భాగంగా ఉప్పల్,రామంతపూర్,నాగోల్ ఏరియా మెడికల్ షాపుల యజమానులు స్వచ్ఛందంగా పాల్గొని డిస్కౌంట్ బోర్డులను తొలగించారు.

అలాగే  ప్రజలకు అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులతో పాటు అసోసియేషన్ ప్రెసిడెంట్ జి వేణుగోపాల్ శర్మ, సెక్రెటరీ తిరుమలరెడ్డి, ట్రెజరర్ నాగరాజు, ఉప్పల్, రామంతపూర్, నాగోల్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.