కురుమూర్తి స్వామివారి హుండీ ఆదాయం రూ. 27,10,403
చిన్నచింతకుంట,నవంబర్ 19: శ్రీ శ్రీశ్రీ కురుమూర్తి స్వామివారి దేవస్థానం(Kurumurthy Swamy Temple) (అమ్మపురం గ్రామం) 2026 వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, గురువారం స్వామివారి మొదటి విడత హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించారు.
ఈ లెక్కింపులో స్వామివారికి భక్తుల ద్వారా రూ. 27,10,403 (ఇరవై ఏడు లక్షల పది వేల నాలుగు వందల మూడు రూపాయలు) ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) మదనేశ్వర్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బత్తుల బాలరాజు సంయుక్తంగా వెల్లడించారు.
పాల్గొన్న ప్రముఖులు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పెద్దమందడి ఆలయ ఈఓ శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర వీరప్పస్వామి దేవస్థానం ఈఓ కె. శివానంద చారి, కురుమూర్తి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
అలాగే ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు మహిపాల్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, తిరుపతి రెడ్డి, మహేందర్, భాస్కరాచారి, సౌజన్య, ప్రేమ్ సాగర్, వి. శంకర్, ఎం. బాలరాజు, నాగార్జునలతో పాటు ఆలయ అర్చకులు వెంకటయ్య, సత్యనారాయణ, లక్ష్మీనరసింహ, శ్రీనివాసులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, భక్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొని లెక్కింపు సజావుగా సాగేందుకు సహకరించారు