ఈవీఎం గోదాంలో కలెక్టర్ తనిఖీలు
నిర్మల్, నవంబర్ 9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాంలోని అన్ని రిజిస్టర్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేయడంతో పాటు అగ్నిమాపక వ్యవస్థ (Fire Safety System) పనితీరును సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ (CCTV Surveillance) చేపడుతూ పటిష్ట భద్రత కల్పించాలని సూచించారు. అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన ఏర్పాట్లు (Fire Safety Measures) ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈవీఎం గోదాం భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, అర్బన్ తహసీల్దార్ రాజు, డీపీఆర్ఓ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.