దివ్యాంగుల పునరావాస కేంద్రానికి దుస్తుల వితరణ
సుల్తానాబాద్ నవంబర్ 17 (విజయక్రాంతి): అన్ని అవయవాలు(Organs) బాగుగా ఉండి చక్కటి జీవితాన్ని అనుభవిస్తున్న మనకి ఒకసారి దివ్యాంగుల పునరావాస కేంద్రానికి వెళ్లి చూసినట్లయితే వారు అనుభవిస్తున్నటువంటి జీవితం మనకి తెలుస్తుందని, వారికి ఏదో రకంగా సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నానని సామాజిక కార్యకర్త యువ సంకల్ప ఫౌండేషన్(Youth Sankalp Foundation) వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ అన్నారు.
వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రంలో మంగళవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన భోగ వేణు అనే వ్యక్తి తన వద్ద నిరుపయోగంగా ఉన్న దుస్తులను పేదవారికి ఇవ్వాలనే సంకల్పంతో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ను సంప్రదించగా వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రానికి తీసుకువచ్చి రాజ్ కుమార్ సమక్షంలో వాటిని అందించారు.
ఈ సందర్భంగా తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ... దివ్యాంగులకు ఎంత చేసిన తక్కువేనని, ప్రస్తుతం ఉన్న చలి తీవ్రగాకు దృష్టిలో ఉంచుకొని వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం లేదా స్వెటర్లు అందించడం చాలా ఉత్తమమని, ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వీరికి సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని కోరుతున్నారని అన్నారు... ఈ కార్యక్రమంలో సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు.