వృద్ధులకు ఫ్రెండ్స్ క్లబ్ చేయూత
ఉచితంగా ఉన్ని దుప్పట్లు, పండ్ల పంపిణీ
తంగళ్ళపల్లి(రాజన్న సిరిసిల్ల జిల్లా) నవంబర్ 29 (విజయక్రాంతి ): మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో ఫ్రెండ్స్ క్లబ్(Friends Club) సభ్యులు వృద్ధులకు అండగా నిలిచారు. తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ పరిధిలోని మండేపల్లి గ్రామంలో ఉన్న వయోవృద్ధుల ఆశ్రమంలో(old age home) తంగళ్లపల్లి ప్రెండ్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఎడమల శ్రీధర్ రెడ్డి(Yedamala Sridhar Reddy) ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
టెక్స్టైల్ రంగ ప్రముఖుడు సామలేటి రాజు సౌజన్యంతో తన తండ్రి సామలేటి భూమలింగం జ్ఞాపకార్థం ఆశ్రమంలోని సుమారు 45 మంది వృద్ధులకు చలికాలంలో ఉపయోగపడే విధంగా ఉన్ని దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.