బీమా.. పెన్షన్ పథకాలతో ఆర్థిక భద్రత
కోనరావుపేట, నవంబర్ 9 (విజయక్రాంతి): ఆర్థిక సమ్మిళిత సాధికారతలో భాగంగా జన సురక్ష పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కోనరావుపేట గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్యాంకు ఎల్బీఓ యోగీశ్వర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన (Jan Suraksha Schemes) పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అలాగే కేవైసీ, రీ-కేవైసీ, ఆధార్ అనుసంధానం, నామినీ నమోదు వంటి బ్యాంకింగ్ సేవల (Banking Services)పై అవగాహన కల్పించారు.
ప్రభుత్వం అందిస్తున్న బీమా, పెన్షన్ పథకాలలో అర్హులైన ప్రతి ఒక్కరూ చేరాలని సూచించారు. ఇప్పటివరకు పథకాలలో నమోదు కాని వారికి అక్కడికక్కడే నమోదు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక భద్రత (Financial Security) పొందాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు సిబ్బంది, బిజినెస్ కరస్పాండెంట్ ఆదర్శ్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు అభిషేక్, వంశీ, శ్రీకాంత్, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన (Public Awareness) కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.