రియల్ ఎస్టేట్ సంస్థలకు ‘ఇరిగేషన్’ అండ..!

18-11-2026 | 05:05am
  1. రాచకాలువల ఆక్రమణలపై అధికారుల మౌనమేల?
  2. జీవో 168ను సాకుగా చూపుతున్నారనే ఆరోపణలు
  3. కాలువల పూడ్చివేతతో పరిసర ప్రాంతాలకు ముంపు ముప్పు
  4. ఎన్‌ఓసీల జారీపై అనేక అనుమానాలు
  5. నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ స్థానికుల ఆగ్రహం

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 17: ప్రజల సాగు, తాగునీటి అవసరాలు(Irrigation and drinking water requirements) తీర్చిన రాచకాలువలు నేడు ఆక్రమణల చెరలో చిక్కుకుని కనుమరుగవుతున్నాయి. జలవనరులను(Water resources) కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారుల(Irrigation officials) నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పరిధిలో రాచకాలువల ఆక్రమణలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం, రియల్ ఎస్టేట్ సంస్థలకు(Real estate company) పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలకు దారితీస్తుంది.

జీవో 168తో వెసులు బాటా?

కాలువల ఆక్రమణల వ్యవహారంలో జీవో నంబర్ 168/2012ను సాకుగా చూపుతూ రియల్ ఎస్టేట్ సంస్థలకు వెసులుబాటు కల్పిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువల పాత రికార్డులు, హద్దులు, విస్తీర్ణాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించకుండానే ఎన్‌ఓసీలు ఎలా జారీ చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాలువల స్వరూపాన్ని మార్చేలా అనుమతులు ఇచ్చారా? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారా? అన్న అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

నోటీసుల పేరుతో కాలయాపన!

రాచకాలువల ఆక్రమణలపై ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తామంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి కాలువల అసలు హద్దులను గుర్తించాలని కోరుతున్నారు. ఆక్రమణలను తొలగించి పూర్వస్థితికి తీసుకురావడంతో పాటు, గతంలో జారీ చేసిన ఎన్‌ఓసీల వ్యవహారంపైనా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. జలవనరులను కాపాడాల్సిన అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా? లేక ఆక్రమణలపై మౌనం కొనసాగిస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు..

రాచకాలువల ఆక్రమణలపై ఇరిగేషన్ అధికారు లను ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెప్తుండ్రు ఆక్రమణలకు గురైన కా లువలను గుర్తించి, వాటిని పరిరక్షించి.. పూర్వ వైభవం తీసుకురావాలి.

- పల్లటి యాదయ్య, 

మాజీ సర్పంచ్, సీతారాంపేట 

మరిన్ని వార్తలు