బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి
- బీసీ సంఘాలతో చర్చించి అభ్యంతరాలు స్వీకరించాలి
- రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తివేయాలి
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
ముషీరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): జాతీయ జనగణనలో బీసీలకు ప్రత్యేక ఓబీసీ కాలమ్, ప్రతి కులానికి ప్రత్యేక యూ నిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్(Jajula Srinivas Goud) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 2న హైదరాబాద్కు వస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీసీ సం ఘాలతో సమావేశమై వారి అభ్యంతరాలను స్వీకరించాలని కోరారు.
శనివారం బీసీ భవన్లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆధ్వర్యంలో జరిగిన స మావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ కులగణన లేకుండా జనాభా లెక్కలు నిర్వహిస్తే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలంటే శా స్త్రీయమైన కులగణన అవసరమన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన చట్టానికి కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని కోరారు. బీసీ కాలమ్ చేర్చే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమా న్ని కొనసాగిస్తామని, అమిత్ షా బీసీ సం ఘాలకు సమయం కేటాయించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సం ఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అ ధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మా, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, గూడూరు భాస్కర్, ఇంద్రం రజక, అంతోజు బ్రహ్మచారి, బండిగారి రాజు, బంగారు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.