సంచి మారినా సరుకొక్కటే !
* మార్కెట్‌లో దొరుకుతున్న రకరకాల బియ్యం వెనుక వెలుగులోకి వస్తున్న రహస్యాలు కొత్త సీసాలో పాత సరుకు అనే నానుడిని నిజం చేస్తోంది. రేషన్ బియ్యాన్నే(Ration rice) మళ్లీ మిల్లులకేసి నున్నగా చేస్తున్నారు. అవే తీరొక్క సన్నబియ్యమని మోసం చేస్తున్నారు. కంట్రోల్ బియ్యానికే కాసింత పాలిష్ పౌడర్(Polishing powder) ఎక్కువేసి రకరకాల పేర్లు పెట్టి అధిక ధరలతో దోచుకుంటున్నారు. అధికారుల దాడుల్లో వెలుగు చూస్తున్న ఈ రహస్యం అందరినీ విస్తుబోయేలా చేస్తోంది.
- కంట్రోల్ బియ్యానికే కల్లబొల్లి పేర్లు
- పాలిష్ వేసి 28 రకాల బ్రాండ్లుగా అమ్మకం
- కరువు వేళ బయటపడుతున్న మిల్లుల బాగోతాలు
- రంగారెడ్డి జిల్లాలో భారీ స్థాయిలో అక్రమాలు
- 200 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యం స్వాధీనం
- తూనికలు, కొలతల్లోనూ బయటపడిన వ్యత్యాసాలు
- రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 90కి పైగా కేసులు
నవంబర్ 4 (విజయక్రాంతి) : పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ(Public Distribution System) (పీడీఎస్) బియ్యం పక్కదారి పడుతోంది. రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యం అక్రమంగా(Illegal rice) మిల్లులకు చేరి, అక్కడ పాలిష్ చేసి వివిధ బ్రాండ్ల పేర్లతో బహిరంగ మార్కెట్లో(Open markets) విక్రయిస్తున్న వారిపై విజిలెన్స్, సివిల్ సప్లయ్ శాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొర డా ఝళిపిస్తున్నారు. సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సీ రాంకుమార్(Civil Supplies Enforcement SC Ramkumar) నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి బుధవారం దాడులు చేపట్టాయి.
రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని మూడు రైస్ మిల్లులు, వాటికి అనుబంధంగా ఉన్న గోదాముల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. మం చాల మండలంలోని రాఘవేంద్ర రైస్ మిల్లుతో పాటు ఇబ్రహీంపట్నం మండలం పోచారంలోని వైష్ణవి, గణేష్ ఆగ్రో ఇండస్ట్రీస్‌లోనూ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మూడు మిల్లులు, వాటి అనుబంధ గోదాముల్లో కలిపి 200 క్విం టాళ్లకు పైగా పీడీఎస్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఒకే బియ్యం.. 28 రకాల బ్రాండ్ల పేరుతో
ఒకే రకం రేషన్ బి య్యాన్ని ఏకంగా 28 రకాల బ్రాండ్ల పేర్లతో ప్యా కింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించా రు. సోనామసూరి, జేఎస్‌ఆర్, ఎస్‌ఎస్, ఎస్‌జే ఎల్, కౌ బ్రాండ్, కర్నూల్, ఫైవ్ స్టార్, ముబారక్, వీజీఆర్, ఆర్‌ఆర్‌ఐ, బెస్ట్ హెచ్‌ఎంటీ, టమాటో గోల్డ్, గజరాజ్, సూర్య తేజ, జోకర్స్, అన్నపూర్ణ తదితర బ్రాండ్ల పేర్లతో బియ్యం విక్రయిస్తున్నట్లు విషయం వెలుగులోకి వచ్చింది. అంతే కాకుండా మిల్లుల్లో వేల సంఖ్యలో వివిధ కంపెనీల బ్రాం డెడ్ సంచులు, ప్యాకింగ్ యంత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక్కో మిల్లులో ఎంత పరిమాణంలో బియ్యం లభించిందనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
ప్రభుత్వ బియ్యం ప్రైవేట్ మిల్లులకు ఎలా?
ప్రభుత్వం పేదలకు ఉచితంగా లేదా సబ్సిడీపై అందించే రేషన్ బియ్యం మిల్లులకు ఎలా చేరుతున్నాయి..? మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా..? రేషన్ బియ్యం సేకరణ వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. ? అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో వెలుగుచూసిన మరో ఆసక్తికరమైన అంశం బియ్యం ప్యాకింగ్. ఒకే రకం బియ్యాన్ని ఏకంగా 28 రకాల బ్రాండ్ల పేర్లతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మిల్లుల్లో బియ్యాన్ని పాలిష్ చేసి, నాణ్యమైన సన్నబియ్యంగా చూపిస్తూ వివిధ కంపెనీల పేర్లతో సంచుల్లో నింపుతున్నట్లు ప్రాథమిక తనిఖీల్లో వెల్లడైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన బ్రాండెడ్ సంచులు, ప్యాకింగ్ యంత్రాలను అధికారులు పరిశీలించారు.
అనుమతులు లేకుండానే మిల్లుల నిర్వహణ?
తనిఖీల సందర్భంగా కొన్ని వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన అనుమతులపైనా సివిల్ అధికారులు దృష్టి సారించారు. అనుమతులు లేకుండా రైస్ మిల్లు నిర్వహిస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. మిల్లుల్లోని రికార్డులు, బియ్యం నిల్వలు, కొనుగోలు వివరాలు, విక్రయాలకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు సైతం పాల్గొన్నారు. మిల్లుల్లోని వేబ్రిడ్జిలు, తూకం యంత్రాలు, సంబంధిత రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. కొలతల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించినట్లు . రవాణా, ప్యాకింగ్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సైతం అధికారులు సేకరించారు.
పేదల బియ్యం వ్యాపార సరుకుగా..
ప్రభుత్వం పేద కుటుంబాలకు అందించే రేషన్ బియ్యం అక్రమ మార్గాల్లో సేకరించి, మిల్లుల్లో ప్రాసెస్ చేసి అధిక ధరలకు విక్రయిస్తే అసలు లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రజా ధనంతో కొనుగోలు చేసి పేదలకు అందించాల్సిన బియ్యం వ్యాపారుల చేతుల్లోకి ఎలా వెళ్తోందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఈ అక్రమ దందాలో బియ్యం సేకరించే వ్యక్తులు, రవాణాదారులు, మిల్లుల నిర్వాహకులు, మార్కెటింగ్ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాలను అధికారులు వెలికితీయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.
బాధ్యులపై కఠిన చర్యలు?
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బియ్యం, రికార్డులు, ప్యాకింగ్ సామగ్రి ఆధారంగా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అక్రమ నిల్వలు, పీడీఎస్ బియ్యం తరలింపు, అనుమతుల ఉల్లంఘనలకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. అయితే రాఘవేంద్ర రైస్ మిల్లులో ఎంత బియ్యం లభించింది? మిల్లు నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి..? అన్నది ఆసక్తిగా మారింది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టి వ్యాపార సరుకుగా మారిన ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.