పాటి బతుకమ్మ ఘాట్ అభివృద్ధికి శ్రీకారం

17-11-2026 | 01:17pm

రూ.25 లక్షలతో పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎంఆర్

పటాన్ చెరు: ముత్తంగి డివిజన్ పరిధిలోని పాటి గ్రామంలో బతుకమ్మ ఘాట్ అభివృద్ధి పనుల(Bathukamma Ghat development works)కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) మంగళవారం శంకుస్థాపన చేశారు. రూ.25 లక్షలతో ఆధునిక వసతులతో ఘాట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఒకే ప్రాంగణంలో అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ డీఈ కృష్ణవేణి, గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు