ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
నాగల్గిద్ద, నవంబర్ 17 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండల పరిధిలోని వల్లూరు గ్రామానికి చెందిన నాగమ్మ భర్త శిరోమణి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుకల్లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Sanjeeva Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు.
అర్హులైన పేదలకు పార్టీలకతీతంగా పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన జీవనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సంగన్న, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు పండరి రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ముంతాజ్ సెట్, గ్రామ సర్పంచ్ షకీర్, కాంగ్రెస్ నాయకులు మోహన్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.