సిరీస్ పట్టేస్తారా?
- నేడు కివీస్‌తో మూడో వన్డే
- సిరీస్ విజయంపై భారత్ గురి
- తీవ్ర ఒత్తిడిలో న్యూజిలాండ్
- మ్యాచ్‌కు వర్షం ముప్పు
న్యూజిలాండ్ పర్యటనలో మరో సిరీస్ విజయంపై భారత్ కన్నేసింది. మూడో వన్డేలోనూ గెలిచి హ్యాట్రిక్ విజయంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోసారి కోహ్లీ,రోహిత్‌లపైనే అందరి చూపు ఉండగా, కివీస్ చావో రేవో పోరుకు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
హామిల్టన్, నవంబర్ 9: భారత్(India), న్యూజిలాండ్(New Zealand) జట్లు మూడో వన్డేకు సిద్ధమయ్యా యి. మంగళవారం హామిల్టన్ వేదికగా ఆసక్తికర పోరు జరగబోతోంది. వరుసగా రెండు వన్డేల్లోనూ గెలిచి 2 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఇప్పుడు సిరీస్ విజయానికి అడుగు దూరంలో నిలిచింది. ఏడేళ్ల తర్వాత కివీస్‌ను మళ్లీ వారి సొంతగడ్డపై ఓడించి వన్డే సిరీస్ గెలవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. చివరిసారిగా 2019లో న్యూజిలాం డ్ తమ సొంతగడ్డపై భారత్ చేతిలోనే సిరీస్ పరాజయాన్ని చవిచూసింది. ఇదిలా ఉంటే భారత్ పూర్తి ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది.
ముఖ్యంగా బౌలర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. కివీస్ పరిస్థితులను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటూ చెలరేగి పోతున్నారు. రెండు వన్డేల్లోనూ న్యూజిలాండ్ బ్యాటర్లపై మన పేసర్లు పూర్తిగా పైచేయి సాధించారు. రెండో మ్యాచ్‌లోనైతే గుర్నూర్ బ్రార్ అదరగొట్టేశాడు. అతనికి తోడుగా అన్షుల్ కాంబోజ్, అకిబ్ నబీ కూడా ఆకట్టుకున్నారు. సీనియర్ పేసర్ అర్షదీప్‌సింగ్ మాత్రం నిరాశపరుస్తున్నాడు. దీంతో తుది జట్టు లో అతన్ని కొనసాగిస్తారా లేక సిరాజ్‌కు అవకాశమిస్తారా అన్నది చూడాలి.
అలా గే ఈ టూర్‌లో అవకాశం దక్కని కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా అనేది కూడా సందిగ్ధంగా మారింది. మ రోవైపు బ్యాటింగ్‌లో మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే అందరి చూపు ఉంది. కోహ్లీ ఫామ్ అందుకున్నా, రోహిత్‌శర్మ మాత్రం ఇప్పటి వరకూ మెరుపులు మెరిపించలేదు. దీంతో ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చెలరేగాలని అభిమాను లు కోరుకుంటున్నారు. మిగిలిన బ్యాటింగ్‌లో గిల్ కూడా ఫామ్‌లోకి రావాల్సి ఉంది. రెండో వన్డేలో శ్రేయాస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడగా, కేఎల్ రాహుల్ కూడా టచ్‌లోకి వచ్చాడు. మిగిలిన బ్యాటర్లు కూడా ఫామ్ అందుకుంటే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు వరుసగా రెండు ఓటములతో న్యూజిలాండ్ తీవ్ర ఒత్తిడిలో ఉంది.
సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఆ జట్టు ఈ మాచ్ లో గెలవడం తప్పనిసరి. అదే సమయంలో కివీస్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలతో దూరమ య్యారు. తాజాగా రెండో వన్డేలో కంకషన్‌కు గురైన టిక్నర్ కూడా తప్పుకున్నాడు. అతని స్థానంలో క్లార్క్‌ను తీసుకున్నారు. కాగా కీలక బ్యాటర్లు లాథమ్, నికోల్, సీఫర్ట్, విల్ యంగ్ పరుగులు చేసేందుకు ఇబ్బందిపడుతున్నారు. టాపార్డర్ బ్యాటర్లు రాణించ కుంటే మాత్రం కివీస్‌కు ఇబ్బందులు తప్పవు. భారత యువ పేసర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ లైనప్‌లో ఎవ్వరూ క్రీజులో నిలవలేకపోతున్నారు.
సొంతగడ్డపై పేలవ ఫామ్‌తో ఉన్న న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో పుంజు కుంటే తప్ప భారత్‌ను నిలువరించే అవకాశాలు లేవు. అటు బౌలింగ్‌లో మాత్రం ఆతిథ్య జట్టు పుంజుకుంది. రెండో వన్డేలో డఫీ, జేమీసన్ రాణించారు. భారత కీలక బ్యాటర్లను త్వరగానే ఔట్ చేసి ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో కివీస్ బౌలింగ్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడే అవకాశాలున్నాయి.హామిల్టన్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా ఉదయం నుంచీ భారీ వర్ష సూచన ఉంది. మ్యాచ్ జరిగే సమయంలోనూ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ నివేదిక చెబుతోంది. మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశాలు కనిపిం చడం లేదు.
తుది జట్ల అంచనా
భారత్ : గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నమన్ ధీర్, గుర్నూర్ బ్రార్, అర్షదీప్ సింగ్, నబీ, అన్షుల్ కాంబోజ్
న్యూజిలాండ్ : సిఫెర్ట్, విల్ యంగ్, డారిల్ మిఛెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, శాంట్నర్, నాథన్ స్మిత్, కైల్ జేమిసన్, డఫీ, మ్యాట్ హెన్రీ