డిసెంబర్ 16న ఐపీఎల్ వేలం
ముంబై, అక్టోబర్ 17 : ఐపీఎల్ 2027 సీజన్కు సంబంధించి మినీ వేలం(IPL 2027 Mini-Auction) తేదీ ఖరారైంది. డిసెంబర్ 16న గోవా వేదికగా వేలం జరగబోతోంది. ఈ మేరకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ నుంచి సమాచారం అందింది. గోవాలోని ఐటీసీ గ్రాండ్ హోటల్(ITC Grand Hotel) ఈ వేలానికి ఆతిథ్యం ఇవ్వనుంది. వేలానికి ఒక రోజు ముందు, అంటే డిసెంబర్ 15న ఫ్రాంచైజీల ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా బ్రీఫింగ్ సెషన్ నిర్వహించనున్నారు.
గత మూడు సీజన్లుగా ఐపీఎల్ వేలం విదేశీ గడ్డపైనే నిర్వహించారు. 2024 సీజన్ కు దుబాయ్, 2025 సీజన్ కు జెడ్డా, 2026 సీజన్ కు అబుదాబి నగరాలు ఈ వేలానికి ఆతిథ్యమిచ్చాయి. మూడేళ్ల సుదీర్ఘ విరా మం తర్వాత ఐపీఎల్ వేలం తిరిగి భారత్లో వేలం జరగనుంది. ఫ్రాంచైజీల నుంచి వచ్చి న విజ్ఞ ప్తులతో బోర్డు, ఈసారి స్వదేశంలోనే వేలం నిర్వహించాలని నిర్ణయించింది.