క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్, శ్రీకాంత్
కుమమోటో మాస్టర్స్ టోర్నీ
టోక్యో, నవంబర్ 12: కుమమోటో మాస్టర్స్‌బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు లక్ష్య సేన్(Lakshya Sen), కిదాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. టైటిల్ రేసులో ఫేవరెట్‌గా ఉన్న లక్ష్యసేన్ ప్రీ క్వార్టర్స్‌లో చైనా కు చెందిన డొంగ్ టియాన్ యావోను 21- 21- తేడాతో కేవలం 35 నిమిషాల్లో చిత్తుచేశాడు.
అంతకుముందు చైనీస్ తైపీ షట్లర్ యు జెన్‌పై విజయం సాధించాడు. లక్ష్యసేన్ క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెందిన యుషి తనాకాతో తలపడనున్నాడు. ఇదిలా ఉంటే మరో భారత ఆటగాడు, మాజీ ప్రపం చ నెంబర్ 1 కిదాంబి శ్రీకాంత్ కూడా ముందంజ వేశాడు. ప్రీ క్వార్టర్స్‌లో అతడు ప్రపంచ 8వ ర్యాంకర్, స్థానిక అభిమానుల ఫెవరేట్ కొడై నరోకాపై 21- 11 21 తేడాతో సంచలన విజయం సాధించాడు. మరోవైపు డబుల్స్‌లో మాత్రం నిరా శే మిగిలింది. ట్రీసా జాలీ - గాయత్రి గోపీచంద్ జోడీ, ప్రీ-క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ జపాన్ జంట ఇవనాగా, నకానిషి చేతి లో 14 14 తేడాతో ఓటమి పాలైంది.