ఎంఐకి జయవర్ధనే గుడ్ బై
హెచ్ కోచ్ పదవికి రాజీనామా
ముంబై, అక్టోబర్ 17 : ఐపీఎల్ 2027 సీజన్ వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీల్లో(Franchise) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నా యి. సపోర్టింగ్ స్టాఫ్ మారిపోతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్కు హెడ్ కోచ్ మహేళ జయవర్ధనే(Head Coach Mahela Jayawardene) గుడ్ బై చెప్పాడు. తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించాడు. పరస్పర అంగీకారంతోనే ఫ్రాంచైజీతో బంధానికి వీడ్కోలు పలికినట్టు వెల్లడించాడు. ఐపీఎల్ 2017 నుంచి 2022 వరకూ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్గా ఉన్న జయవర్థనే తర్వాత రెండేళ్లు గ్లోబల్ హెడ్గానూ సేవలందించాడు.
మళ్లీ 2025 సీజ న్లో హెచ్ కోచ్గా బాధ్యతలు అందుకున్న ఈ లంక దిగ్గజం ఇప్పుడు 2027 మినీవేలానికి ముందు పదవి నుంచి తప్పుకున్నాడు. గత సీజన్లో సరైన ఫలితాలు రాకపోవడంతోనే ఫ్రాంచైజీ అతని విషయంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పదవికి రాజీనామా చేసిన జయవర్ధనే ముంబై ఫ్రాం చైజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్ పెట్టాడు. కోచ్గా ముంబైకి పనిచేసిన రోజులు జీవితాంతం గుర్తుండిపోతాయం టూ వ్యాఖ్యానించాడు.
ప్లేయర్లు, కోచిం గ్ టీమ్, ముంబై కుటుంబం అండగా నిలిచారని గుర్తు చేసుకున్నాడు. అటు జయవ ర్థనే సేవలను కొనియాడుతూ ముంబై ఫ్రాం చైజీ ఓనర్ నీతా అంబానీ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ముంబై కుటుంబంలో ఆయన ఎప్పటికీ భాగమేనని స్పష్టం చేశారు. జయవర్థనే కోచింగ్ హయాంలో ముంబై ఇండి యన్స్ 2017, 2019, 2020 మొత్తం మూ డు సార్లు ఛాంపియన్గా నిలిచింది. అయితే గత రెండు సీజన్లుగా నిరాశపరుస్తోంది. కాగా వచ్చే సీజన్ కోసం ముంబై కొత్త హెడ్ కోచ్ కోసం అన్వేషిస్తోంది.