ఆప్గన్‌కు జింబాబ్వే షాక్
షార్జా, నవంబర్ 17 : టెస్ట్ క్రికెట్లో(Test cricket) జింబాబ్వే(Zimbabwe) సంచలన విజయం సాధించింది. ఆప్గనిస్తాన్‌తో(Afghanistan) జరిగిన రెండో టెస్టులో అద్భుత విజయాన్ని అందుకుని సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో జింబాబ్వే 57 పరుగుల తేడాతో గెలుపొందింది. 418 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్గన్ జట్టు డ్రా(Afghan team draws) కోసం ఐదో రోజు చివరి వరకూ పోరాడింది. సనీర్ఖాన్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచిన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 339 పరుగులు చేయగా, ఆప్గనిస్తాన్ 217 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 295 పరుగులు చేసింది.