రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి

19-11-2026 | 09:43pm

సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధనుంజయ నాయుడు

నేరేడుచర్ల,నవంబర్ 19(విజయ క్రాంతి): నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తక్షణమే 14 రకాల వస్తువులను రేషన్ షాప్ ల(Ration shop) ద్వారా ప్రజలకు సబ్సిడీపై అందించాలని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు(CPI State Committee Member) ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు గురువారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల తాసిల్దార్ కార్యాలయంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ...

ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తుందని మున్నెన్నడు లేని విధంగా కిలో బియ్యం 100 రూపాయల దాకా విక్రయిస్తున్నారని బియ్యం ధరలు అదుపులో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉన్నదని ధరల నియంత్రణ,

పంపిణీ వ్యవస్థ బలోపేతం చేయాలని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బియ్యం ఇతర నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచుతున్నారని దీని వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ నిల్వదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపులోకి తీసుకురావాలని అక్రమంగా నిలువచేసిన గోదాములపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు అమరారపు పున్నయ్య  ఏఐటీయూసీ ప్రాంతీయ సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్ ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్ కొదమగుండ్ల మట్టయ్య మధుసూదన రెడ్డి వీరస్వామి ఎస్కె లాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు