27లక్షల మందికి ఏకకాలంలో టిఫిన్
- ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలల్లో అల్పాహారం
- ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
- సూర్యాపేట జిల్లాలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు శంకుస్థాపన
- నవంబర్ 19న ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’కు ప్రభుత్వం శ్రీకారం
- రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయం : మంత్రి ఉత్తమ్
కోదాడ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): 27లక్షల మంది విద్యార్థులకు(Students') ప్రతిరోజూ వే డివేడి అల్పాహారం అందించే కార్యక్రమం ప్రపంచంలో మరెక్కడా లేదని, మన తెలంగాణలోనే అమలు చేస్తున్నామని ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల గ్రామంలో పాఠశాలల విద్యార్థుల కోసం రూ.9.6 కోట్లతో నిర్మించనున్న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌కు(Centralized Community Kitchen) మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో(Uttam Kumar Reddy) కలిసి మంగళవారం డిప్యూ టీ సీఎం భట్టి శంకుస్థాపన చేశారు.
అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగిం చారు. విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహా రం ఉచితం కాదని, అది రాష్ట్ర భవిష్యత్తు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అని పేర్కొన్నారు. 1,020 పాఠశాలల్లో దాదాపు 60 వేల మంది విద్యార్థులకు ఒకే కిచెన్ వేడివేడి అల్పాహారం అందించేందుకు మునగా లలో ఈ గ్రీన్‌ఫీల్డ్ కిచెన్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పథకం ఏదైనా అంతిమ లక్ష్యం పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదగడమేనని పేర్కొన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక కార్యకలాపాలు పెరిగి రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపారు.
బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ప్రక టనలపై భట్టి తీవ్రస్థాయిలో స్పందించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని వారు, మళ్లీ ఏం చేయడానికి వస్తామంటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశా రు. ప్రజాప్రభుత్వంలో అమలవుతున్న పథకాలను నిలిపివేయడానికి వస్తామంటున్నా రా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు అమాయకులు కాదని, అన్నీ గమనిస్తున్నారని అ న్నారు. బీఆర్‌ఎస్‌కు గతమే తప్ప భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు. రాష్ర్టంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని తీసుకురానున్నట్లు భట్టి ప్రకటించారు.
నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కుటుంబ యజమానికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక భద్రత కలుగుతుందని పేర్కొన్నా రు. ప్రతీ నియోజకవర్గంలో రూ.200 కోట్ల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. కో దాడ, హుజూర్‌నగర్ ప్రాంత ప్రజలు తమ కుటుంబమని పేర్కొంటున్న మంత్రి ఉత్తమ్ లాంటి నిస్వార్థ నాయకులు లభించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని భట్టి అన్నారు.
అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మా ట్లాడారు. రాష్ర్టంలో మళ్లీ కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వస్తుందన్నారు. అలాగే రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం రాష్ర్టంలోనే మొట్టమొదటిగా మునగాలలో సెంట్రలైజ్డ్ కమ్యూ నిటీ కిచెన్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రజలకు ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా లక్షల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారని వి మర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచే లక్షకు పైగా ఓట్ల మెజార్టీ అందించారని తెలిపారు. ఉమ్మడి ఏపీలో నాలుగు పర్యాయాలు, తెలంగాణలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజ లే తనకు దేవుళ్లన్నారు. ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తు న్న భట్టికి కృతజ్ఞతలు తెలిపారు. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం సహకారం అందిస్తున్న హరేకృష్ణ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు ప్రకటించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నర్సిం హ, శంకర్ నాయక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ వంగవీటి రామారావు, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధి సత్య దాస్, ప్రజాప్రతినిధులు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.