ఇందిరమ్మ ఇంట్లో ఎమ్మెల్యేతో దీపావళి సంబరాలు
ఎమ్మెల్యే రాకతో లబ్ధిదారు నిర్మల కళ్లలో ఆనందభాష్పాలు: కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి 22వ వార్డుకు చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు(Indiramma House Beneficiary) కొమ్మగల్ల నిర్మల ఇంటిని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) ప్రారంభించి, కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే రాకతో భావోద్వేగానికి గురైన నిర్మల ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యేగా కుంభం అనిల్ కుమార్ రెడ్డే గెలుస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్(Municipal Chairperson Tangallapalli Srivani Ravikumar), వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, హౌసింగ్ పీడీ, మున్సిపల్ కమిషనర్, మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, కౌన్సిలర్లు జాలిగం విఘ్నేష్, బర్రె పూజిత, తాహెరా బబ్లు, చల్ల కిషోర్, కుక్కదువు సోమయ్య, ఈరపాక నర్సింహా, బురాన్, మనీష్, మహేందర్, శివతేజ, ప్రమోద్, మజహర్, శివ తదితరులు పాల్గొన్నారు.