టార్గెట్ యూత్

12-11-2026 | 05:30am

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్కారు సరికొత్త వ్యూహం

  1. యువత, నిరుద్యోగ ఓటర్లే లక్ష్యం 
  2. రాజీవ్ యువవికాసం అమలుకు కసరత్తు 
  3. రాష్ట్రవ్యాప్తంగా 16.30 లక్షల దరఖాస్తులు 
  4. యువతకు చేరువై ఎన్నికల్లో గెలవాలనే యోచన

నవంబర్ 11 (విజయక్రాంతి): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు(Graduate MLC Election) అధికార పార్టీ సరికొత్త వ్యూహాలకు పదునుపెడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న నిరుద్యోగులు, యువతను తమవైపు తిప్పుకునేందుకు ‘పథకం’ వేస్తున్నట్లు స్పష్టమవుతున్నది.  నిరుద్యోగులు(Unemployed people), యువతీయువకుల ఓట్లు లక్ష్యంగా పక్కా కార్యాచరణకు ప్లాన్ వేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది.

వచ్చే ఏడాది జరగనున్న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టేందుకు గట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రతిపక్ష పార్టీలను ధీటుగా ఎదుర్కోవాలంటే రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అది కూడా ఈనెలలోనే అమల్లోకి తెచ్చేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

యువతను ఆకర్షించేలా పథకం!

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 16,30,522 మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. యువతకు రూ.50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు ఆర్థికసాయం చేస్తామని అధికార పార్టీ గతంలో ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ గత ఏడాది ఏప్రిల్ 14తో ముగిసింది. దరఖాస్తు గడువు ముగిసి ఏడాదిన్నర దాటినా, ఇప్పటి వరకు ఈ పథకం అమలుకు నోచుకోలేదు.

దీన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి ఉన్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అడ్డంకిగా మారిందనే వాదనలు ఉన్నాయి. వచ్చే ఆదాయం ప్రస్తుతం అమలులోఉన్న సంక్షేమ పథకాలకు, ఇతర కార్యక్రమాలకే సరిపోతున్నది. ఈక్రమంలో ఈ పథకం అమలుపై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడింది. అయితే వచ్చే ఏడాదిలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో దీన్ని అమలు చేస్తే బాగుంటుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగుల నుంచి డిమాండ్ వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రాజీవ్ యువ వికాసం వేడినీళ్లకు చన్నీళ్లు తోడైనట్లుగా ఉంటుందనే భావనలో పార్టీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ పథకం ద్వారా కొంత మందికైనా స్వయం ఉపాధి కల్పించి, యువతకు చేరువ కావచ్చనే లెక్కలేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి అందిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు 13.83 లక్షల దరఖాస్తులు  పరిశీలించినట్లుగా తెలిసింది.

అయితే తొలుత ఈ పథకంలో యూనిట్ల వారిగా ఎంత మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలి? ఐదు లక్షల మందికా? విడతలవారిగానా? లేక అర్హులైన వారందరికా? అనేదానిపై ప్రభుత్వం కసర త్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తును చేపడుతున్నది. లబ్దిదారుల తుది జా బితా ఎంపిక కాగానే లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీ నిధులను ఆమ చేయనున్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఓటు వేసేది సాధారణ ఓటర్లు కాదు.

డిగ్రీ పూర్తి చేసిన గ్రా డ్యుయేట్లు మాత్రమే. వారిలోనూ చదువుకొని ఉన్న నిరుద్యోగులు, ఉద్యోగార్థులు, యువ తే కీలకం. ఉపాధిలేక ప్రభుత్వ ప్రోత్సాహం కోసం వారు ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే కాంగ్రె స్.. గత అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు- ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, రాజీవ్ యువ వికాసం అమలు చేస్తామని హామీలిచ్చింది. అందులో ఒక్కటీ నెరవేరలేదు. దీంతో ప్రభుత్వంపై యువత అసంతృప్తితో ఉంది.  అందుకే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారా యి.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే భవిష్యత్ ఎన్నికల్లో ప్రభావం పడుతుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ స్థానా న్ని బీజేపీ గెలిచింది. అది కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ. ఈసారి ఈ రెండు స్థానాలు గెలిచి యువత మాతోనే ఉంది అని చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఫలితాలను చూపి గ్రేటర్ జీహెచ్ ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో బరిలో నిలవాలని చూస్తోంది. గ్రాడ్యుయేట్ ఓటర్లలో చాలా మంది గ్రామీణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేపథ్యం నుంచి ఉన్నవారే ఉంటారు. వారి కుటుంబాల్లో ఒకరికి రాజీవ్ యువ వికాసం లబ్ధి చేరితే, ఆ కుటుంబం మొత్తం ఓటు ప్రభావితం అవుతుందనే వ్యూహంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు