పదేండ్లలో క్యాన్సర్ ఖతం!

12-11-2026 | 05:05am
  1. అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక రుగ్మతలకూ చెక్
  2. ఏఐతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
  3. ఆంథ్రోపిక్ సీఈవో సంచలనాత్మక ప్రకటన

నవంబర్ 11:  క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు(Cancer, Alzheimer's, heart disease) వంటి ప్రాణాంతక వ్యాధులకు రానున్న రోజుల్లో చెక్ పడనుందా? కృత్రి మ మేధస్సు(Artificial Intelligence) (ఏఐ) వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుందా? అంటే.. ఆవుననే అంటున్నారు ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడేయ్. ఏఐ సాయంతో పదేళ్లలోనే వైద్య రంగంలో ఊహించని ఆవిష్కరణలు జరుగుతాయని,   మానవాళిని వేధిస్తున్న అనేక వ్యాధులు అరిక ట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

జీవశాస్త్ర పరిశోధనలు, వ్యాధుల నిర్ధారణ, కొత్త ఔషధాల తయారీలో ఏఐ కీలకపాత్ర పోషిస్తుందని, వందల ఏళ్లుగా వైద్య శాస్త్రానికి సవాల్‌గా నిలుస్తున్న సమస్యలకు పరిష్కారం చూపుతుందని డారియో చెప్పారు. గూగుల్ ఏఐ విభాగం అధిపతి డెమిస్ హసాబిస్, టెస్తా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏఐ అభివృద్ధి చెందితే సామాన్యులకు కూడా అమెరికా అధ్యక్షుడిస్థాయి వైద్యం  అం దుతుందని తెలిపారు. 

సాధ్యం కాదంటున్న నిపుణులు 

ఫార్మా రంగ నిపుణుల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. ఏఐతో ఔషధాల అన్వేషణ వేగవంతం అయినా.. వాటిని పూర్తిస్థాయి మందులుగా అభివృద్ధి చేయడం అంత సులభం కాదంటున్నారు. ఏఐ సాంకేతికతతో 10 వేల ఔషధ సమ్మేళనాలను పరిశీలించారని.. అయితే వాటిలో ఒక్కటి కూడా స్వతంత్య్రంగా పనిచేసే ఔషధాన్ని అభివృద్ధి చేయలేకపోయిందని గుర్తు చేశారు.కొత్త ఔషధాన్ని గుర్తించినా దాన్ని జంతువులపై, మనుషులపై ప్రయోగించాల్సి ఉంటుందని..  అనుమతులు, పరిశోధనలు పూర్తి చేసేందుకు చాలా సంవత్సరాలు పడుతుందని అన్నారు. కొత్త ఔషధ అభివృద్ధికి సాధారణంగా 10 ఏళ్లు పడుతుందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు