పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ

14-11-2026 | 08:47pm

బోథ్. నవంబర్ 14 ( విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన మాసం వెల్ఫేర్ సొసైటీ(Masam Welfare Society) అధ్యక్షులు అనిల్ కుమార్ అన్న కూతురు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలురప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు బుక్కులు పెన్నులు తెలిసిందని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అన్న కూతురు పుట్టిన రోజు సేవా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

ప్రతి ఏడాది మాసం వెల్ఫేర్ సొసైటీ వారు ప్రతి ఏటా సేవా కార్యక్రమాలను చేయడం అభినందనీయమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సభ్యుల మడాలిశ్రీనివాస్ రావు, శ్రీను, వెంకట్, ఆసిఫ్, అర్షదులు ఉన్నారు.

మరిన్ని వార్తలు