సింగరేణి విశ్రాంత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

14-11-2026 | 08:56pm

లేకుంటే ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు సిద్ధం కావాలి

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): సింగరేణి విశ్రాంత కార్మికుల హెల్త్ కార్డు(Health Card for Retired Singareni Workers) పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలని, సొంత ఇంటి నిర్మాణానికి 250 గజాల స్థలం, రూ.30 లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని జిల్లా సింగరేణి వాలంటరీ రిటైర్మెంట్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బూడిది గోపాలకృష్ణ డిమాండ్ చేశారు.

కనీస పెన్షన్ రూ.15 వేలకు పెంచడంతో పాటు కరువు భత్యం కలిపి చెల్లించాలని కోరారు. గ్రాట్యుటీ బకాయిలు, వైద్య సదుపాయాలు, మూడు నెలలకు సరిపడా మందుల పంపిణీ సమస్యలను పరిష్కరించాలన్నారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ డిమాండ్లను ఆమోదించి అమలు చేయాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా విశ్రాంత బొగ్గు గని కార్మికులతో కలిసి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పోటు బాబు, ఉపాధ్యక్షుడు గుర్రపు గంగయ్య, కోశాధికారి కోరుట్ల యాదగిరి, ఎండీ నియాజ్ అహ్మద్, రాజిరెడ్డి, సాంబగౌడ్, మాదాసు వెంకటేష్, మాటూరు లక్ష్మీనారాయణ, పోషం, ముధం సత్తయ్య, చేకూరి మోహన్ గౌడ్, పత్యం రంగయ్య, చిలుకూరి బానయ్య, కంకటి శంకర్, కటకం శంకర్, దుర్గం శంకర్, శ్రీనివాస్, గంగిశెట్టి, కామాద్రి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు