సంగోజివాడిలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

14-11-2026 | 09:08pm

తాడ్వాయి,నవంబర్,14( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి ప్రాథమికోన్నత పాఠశాలలో (Sangojiwadi Upper Primary School) శనివారం ఘనంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎల్లారెడ్డికి చెందిన వంగపల్లి కాశీనాథ్ నోటు పుస్తకాలు,డిక్షనరీలు, పరీక్షా ప్యాడ్ లు,రబ్బర్లు,పెన్సిళ్లు తదితర బోధనోపకర పరికరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాజోద్దీన్, నాయకులు రవీందర్ రావు,లింగారావు, ప్రధానోపాధ్యాయులు మురళి,ఉపాధ్యాయులు జమీల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు