ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యానికి ప్రభుత్వమే బాధ్యత

14-11-2026 | 09:19pm

తెలంగాణ రక్షణ సేన పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడి నరేష్.

చిట్యాల, నవంబర్ 14 (విజయ క్రాంతి): చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో(Veliminedu Village) ధాన్యం కొనుగోళ్ల(Grain procurement) విషయంలో రైతులు (Farmers) ఎదుర్కొంటున్న ఇబ్బందులు బాధాకరమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని  తెలంగాణ రక్షణ సేన పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి మేడి నరేష్ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత, తూకంలో జాప్యం, తేమశాతం పేరుతో ఇబ్బందులు, కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లై అధికారులు సైతం రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మేడి నరేష్ విమర్శించారు.

మరిన్ని వార్తలు