ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ క్యాంపు

14-11-2026 | 09:03pm

ముకరంపుర, నవంబర్ 14(విజయ క్రాంతి): వరల్డ్ డయాబెటిస్ డే(World Diabetes Day) సందర్బంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(Indian Medical Association) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో మల్టీపర్పస్ పార్క్ లో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఆదర్శ హాస్పిటల్ వారి సహకారంతో దాదాపు 150 మంది వాకర్స్ మరియు పార్క్ సిబ్బందికి షుగర్ , బీపీ  మరియు ఈసీజి పరీక్షలు ఉచితంగా చేశారు.

ఐఎంఎ అధ్యక్షులు డా. అరుణ్ కఠారి మాట్లాడుతూ ప్రివెన్షన్ ఈజ్ బెటర్  దెన్ క్యూర్ కాబట్టి, షుగర్ వ్యాధి రాకుండా మంచి ఆహారపు అలవాట్లతో పాటు శారీరక వ్యాయామం ముఖ్యం అన్నారు. అలానే ఇలా క్యాంప్ స్క్రీనింగ్ పరీక్షల్లో ఎవరికైనా షుగర్ ఉన్నట్లు తేలితే IMA తరపున హాస్పిటల్ లలో ఉచిత కన్సల్టేషన్ తో పాటు ల్యాబ్ టెస్టుల్లో కూడా వీలైనంత రాయితీ ఇప్పిస్తామని చెప్పారు.

డా విజయ్ కుమార్ సెక్రటరీ  "షుగర్ వ్యాధి అనేది తీయని నెమ్మది విషం లాంటిదని, అది శరీరంలో అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది కావున సరైన మందులు వాడుతూ, ప్రతీ 6 నెలలకు ఓ సారి కంటి & కిడ్నీ పరీక్షలు తప్పకుండా చేసుకోవాలి" అని చెప్పారు. ట్రెజరర్ డా. ఆడెపు మానస ఆదర్శ హాస్పిటల్ & మల్టిపర్పస్ పార్క్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సీనియర్ వైద్యులు డా అలీమ్, డా స్రవంతి, డా ప్రవీణ్, ఆదర్శ హాస్పిటల్ మేనేజర్ దుర్గా ప్రసాద్, హాస్పిటల్ సిబ్బంది మరియు పార్కు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు