ఆర్టీసీ బస్సు ఢీకొని తొమ్మిదేళ్ల బాలుడు మృతి

14-11-2026 | 09:15pm

ఆసిఫాబాద్, నవంబర్ 14(విజయ క్రాంతి):ఆర్టీసీ బస్సు ఢీకొని(Hit by an RTC bus) తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద ఘటన మండలంలోని మోతుగూడ గ్రామంలో(Motuguda Village) చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చౌదరి రామచందర్, రోజా దంపతుల చిన్న కుమారుడు వర్షిత్ (9) ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. శనివారం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి ఆడుకునేందుకు రోడ్డు దాటుతుండగా మంచిర్యాల నుంచి ఆసిఫాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రహదారికి ఒకవైపు లారీలు నిలిపి ఉంచడంతో బస్సు డ్రైవర్‌కు బాలుడు కనిపించకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు