దర్యాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

14-11-2026 | 09:04pm

ముత్తారం, నవంబర్ 14(విజయక్రాంతి): మండలంలోని దర్యాపూర్ గ్రామంలో(Daryapur Village) ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(Primary Agricultural Cooperative Society) ముత్తారం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ రాపెల్లి రాజయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు(Farmers) తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు(Grain purchasing centers) తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రం అందుబాటులోకి రావడంతో దర్యాపూర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

మరిన్ని వార్తలు