నెహ్రూ 137వ జయంతి ఘనంగా నిర్వహణ

14-11-2026 | 08:56pm

జనగామ, (విజయక్రాంతి): భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకల(Jawaharlal Nehru 137th Jayanti)ను జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ(District Congress Committee President Lakavath Dhanvanthi) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మాట్లాడుతూ... స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ పోషించిన కీలక పాత్ర, దేశ తొలి ప్రధానమంత్రిగా అభివృద్ధికి వేసిన పునాదులు, పారిశ్రామిక, విద్యా, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకున్నారు.

ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, జాతీయ సమైక్యతకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. చిన్నారులను ఎంతో ప్రేమగా చూసుకున్న నెహ్రూ ఆశయాలను, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పురపాలక అధ్యక్షులు వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, మాజీ పురపాలక అధ్యక్షులు, మాజీ సంత కమిటీ అధ్యక్షులు ఎర్రమల్ల సుధాకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వంగల కళ్యాణి మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్, షెడ్యూల్డు కులాల విభాగం అధ్యక్షులు వేముల మల్లేష్, సేవా దళం అధ్యక్షులు జయ మల్లేష్, అల్పసంఖ్యాక వర్గం అధ్యక్షులు మాజీద్ అఫ్సర్, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు