అనుమతి లేకుండా నడుపుతున్న 9 ఎడ్యుకేషన్ కళాశాలలు

14-11-2026 | 08:58pm

యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి

ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి హరీష్,ఎండీ అన్వర్

మేడిపల్లి, నవంబర్ 14 (విజయక్రాంతి) : బోడుప్పల్ సర్కిల్(Boduppal Circle) పరిధిలోని ఎలాంటి ప్రభుత్వ అనుమతులు(Government Approvals) లేకుండా అక్రమంగా తగరగతులు నిర్వహిస్తున్న 9 ఎడ్యుకేషన్ కళాశాల(College of Education) ముందు ఏఐఎస్ఎఫ్(AISF) ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శి హరీష్, అన్వర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు ఎటువంటి ఇంటర్ బోర్డు అనుమతులు(Intermediate Board Approvals) లేకున్నా ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను చేర్చుకొని వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆకళాశాలకు ఎటువంటి గుర్తింపు లేకున్నా విద్యార్థులను చేర్చుకొని, వారిని వారి తల్లితండ్రులను మోసం చేస్తు ఇప్పటికే వారి నుండి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి, అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారు అని ఆరోపించారు. తక్షణమే ఇంటర్ విద్యాధికారులు ఈ కళాశాల తనిఖీ చేసి,యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్  జిల్లా ఉపాధ్యక్షులు, కృష్ణ, మేడిపల్లి మండల కార్యదర్శి, శ్రీకాంత్,జిల్లా నాయకులు,భరణి, సాయి, సోహెల్, నరేందర్,సిద్దు, గౌతమ్, తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు