విద్యతో ఏదైనా సాధించవచ్చు
ఆసిఫాబాద్(విజయక్రాంతి): విద్యతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మాజీ అటవీశాఖ కార్పొరేషన్ చైర్మన్, హోలీ ట్రినిటీ పాఠశాల చైర్మన్ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో కరస్పాండెంట్ ధవేణి మల్లేష్, ఎంఈఓ రాథోడ్ సుభాష్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాచా నెహ్రూ సేవలను గుర్తుచేశారు. అనంతరం సింగపూర్ విద్యావిధానంపై ఎంఈఓ రాథోడ్ సుభాష్ విద్యార్థులకు వివరించి, క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన ఎంఈఓ సుభాష్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీల్, ట్రాస్మా జిల్లా నాయకులు రాధాకృష్ణ చారి, బీజేపీ నాయకులు వెంకన్న, మురళీగౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.