శ్రీ కార్తికేయ పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు
తంగళ్లపల్లి, నవంబర్ 14 (విజయ్ క్రాంతి) : తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ కార్తికేయ పాఠశాలలో(Sri Kartikeya School) బాలల దినోత్సవ వేడుకలు(Children's Day Celebrations) శనివారం ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ గజభీంకార్ రమేశ్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చాచా నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని, నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు అని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.