సరిహద్దు చెక్‌పోస్టులో పకడ్బందీగా తనిఖీలు

17-11-2026 | 05:28pm

బోథ్ నవంబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఘన్పూర్ చెక్‌పోస్టు(Ghanpur Checkpost)లో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాత్రిపూట ఎముకలు కొరికే చలిలో సహితం చెక్ పోస్టులపై సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పశువుల అక్రమ రవాణాతో పాటు మహారాష్ట్ర నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వివిధ రకాల సామాగ్రిని దొంగచాటుగా కాకుండా నిలిపివేస్తున్నారు.

మరిన్ని వార్తలు