అప్పుల బాధతో టైలర్ ఆత్మహత్య
జగిత్యాల, నవంబర్ 17 ( విజయ క్రాంతి): జగిత్యాల పట్టణంలో అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన టైలర్ శంకర్ (34) ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డాడు. పట్టణంలోని తీన్ ఖని చౌరస్తా(Teen Khani Crossroads) వద్ద గత 20 ఏళ్లుగా టైలరింగ్ దుకాణం(Tailoring shop) నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
దసరా, దీపావళి పండుగల సమయంలో వ్యాపారం బాగుంటుందని ఆశించినా రెడీమేడ్ దుస్తుల ప్రభావంతో ఆశించిన ఆదాయం రాలేదు. దుకాణం అద్దె చెల్లించలేక, కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు పెరగడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్‌లో కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించినట్లు సమాచారం. ఘటనపై జగిత్యాల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.