బీఆర్ఎస్‌ కౌన్సిలర్లకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదు

17-11-2026 | 05:32pm

నాగర్‌ కర్నూల్‌ (విజయక్రాంతి): నాగర్‌ కర్నూల్‌ మున్సిపాలిటీలో(Nagarkurnool Municipality) అధికారులు ప్రోటోకాల్‌ను(Official protocol) పక్కనపెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాలుగా నిర్వహిస్తున్నారని 10వ వార్డు కౌన్సిలర్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ చారి ఆరోపించారు. బీఆర్ఎస్‌ కౌన్సిలర్లకు ప్రజా ప్రతినిధులుగా కనీస గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీకి రూ.40 కోట్లు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.20 కోట్లు మంజూరైనట్లు ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు చేపట్టిన పనుల వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి వార్డుకు రూ.కోటి నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.

మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చేతుల మీదుగా పింఛన్ల పత్రాల పంపిణీలో అర్హులైన వృద్ధులకు పింఛన్లు అందడం లేదని, వారందరికీ వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తూ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్‌ ప్రకారం గౌరవం ఇవ్వాలని జయప్రకాష్‌ నారాయణ్‌ చారి డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు