బాలామృతం ప్లస్‌పై అవగాహన కార్యక్రమం
పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం అవసరం
తంగళ్లపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-1లో బాలామృతం ప్లస్‌పై 10 నిమిషాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తంగళ్లపల్లి సెక్టార్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి డీపీఓ వీరభద్రయ్య, ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సూపర్వైజర్ సౌజన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు బాలామృతం ప్లస్ ప్రాధాన్యత, ప్రయోజనాలను వివరించారు.
పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించేందుకు ప్రతి నెలా తప్పనిసరిగా బరువు తూయించాలని సూచించారు. ఆరేళ్లలోపు వయస్సు పిల్లలకు అత్యంత కీలకమని, ఈ దశలోనే మెదడు ఎదుగుదల వేగంగా జరుగుతుందని తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ, వారిని చురుకుగా ఉంచాలని, ప్రభుత్వం అందిస్తున్న అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్తలు, పిల్లల తల్లులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.