లేఆఫ్ ప్రకటించిన మరో టెక్ దిగ్గజం

12-11-2026 | 05:20am

క్వాల్‌కామ్‌లో 3,600 ఉద్యోగుల తొలగింపు 

హైదరాబాద్ సహా భారత్‌లో 1000 మందిపై వేటు

నంబర్ 11: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ టెక్నాలజీ రంగాన్ని(IT technology sector) ఉద్యోగాల కోతలు కుదిపేస్తున్నాయి. అమెరికాకు(America) చెందిన ప్రముఖ సెమీకండక్టర్, చిప్ తయారీ సంస్థ(Semiconductor and chip manufacturing company) క్వాల్‌కామ్ తాజాగా 3,600 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రభావం భారత్‌పైనా బలంగానే పడనుంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో కనీసం 1,000 మందిపై వేటు పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 52,000 మంది ఉద్యోగులు ఉన్న క్వాల్‌కామ్ సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా కనీసం 7 శాతం సిబ్బందిని తగ్గించుకోవాలని భావిస్తోంది. ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షలు, సంస్థ భవిష్యత్తు వ్యాపార అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఈ మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

బెంగళూరులో మొదలైన తొలగింపు

క్వాల్‌కామ్ సంస్థకు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై నగరాల్లో పరిశోధన, అ భివృద్ధి, సాఫ్ట్‌వేర్, చిప్ డిజైన్, ఇంజినీరింగ్ కార్యకలాపాలున్నాయి. ఈ సంస్థకు భారత్‌లో 20వేల మంది ఉద్యోగులు ఉన్నారు. తొలివిడత తొలగింపు బెంగళూరులో ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హైదరా బాద్ ఉద్యోగుల్లోనూ తొలగింపుపై చర్చ జరుగుతోంది. ఏ నగరంలో ఎంతమందిని తొలగిస్తారనేది స్పష్టం కాలేదు.

తొలగించే ఉ ద్యోగులకు మూడు నెలల జీతానికి సమానమైన సెవరెన్స్ ప్యాకేజీ, లేఆఫ్ అందుకున్న ఉద్యోగులు మూడు రోజుల్లోగా సంతకం చేస్తే మరో నెల వేతనం అదనంగా ఇస్తారు. అర్హత, కంపెనీ నిబంధనలను బట్టి కొంతకాలం ఆ రోగ్య బీమా ప్రయోజనాలు, కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు కెరీర్ ట్రాన్సిషన్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు కూడా దక్కుతాయి. 

మరిన్ని వార్తలు