ఘోర రోడ్డు ప్రమాదం

09-11-2026 | 04:22pm

ట్రాక్టర్ కారు ఢీ తండ్రి, కూతురు మృతి

సిద్దిపేట: జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) తీవ్ర విషాదాన్ని నింపింది. వేగంగా వచ్చిన కారు, ట్రాక్టర్(Car-Tractor) ఒకదానికి ఒకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంతో ఘటన స్థలంలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ దుర్ఘటనలో చిగురుమామిడి మండలం కొండాపూర్ కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (33), ఆయన ఏడేళ్ల కుమార్తె మహన్వీ అక్కడికక్కడే మృతి చెందారు. కంటిముందే, భర్త, కూతురు ప్రాణాలు కోల్పోవడంతో మృతుని భార్య స్వాతి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను బయటకు తీసి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా సంఘటనను తెలుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిర్బందికి గురైయి సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు