బీసీలకు ‘జీవో’ద్ధారకమవ్వాలి !
ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ :
* ప్రభుత్వ ధనంతో ఏ పని చేపట్టినా, ఏ నిర్మాణం చేసినా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న బీసీల ఆత్మగౌరవ భవనాలతో కూడా ఆ సామాజిక వర్గంలోని వారికి ఆశించిన ప్రయోజనం చేకూరాల్సిందే. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం జీవో నంబర్ 14ను విడుదల చేసింది. ఈ జీవోపై బీసీ వర్గంలోని కొన్ని కులాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో ప్రజాధనంతో నిర్మించే భవనాల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం, నిధుల సక్రమ వినియోగం ఉండాలనే అభిప్రాయాలూ వెల్లడవుతున్నాయి. ఏదేమైనా ప్రభుత్వ నిర్ణయం బీసీలకు మేలు జరగాలనేదే అంతిమ లక్ష్యం కావాలి.
తెలంగాణలో బీసీ వర్గాల ఆత్మగౌరవ భవనాల(Self-respect buildings for BC communities) నిర్మాణం, వాటి నిర్వహణ, ప్రజాప్రయోజనాల వినియో గం వంటి అంశాలు ఇప్పుడు రాజకీయ చర్చకు(Political discussion) తెరలేపాయి. ఈ నేపథ్యంలో జీవో నంబర్ 14పై వస్తున్న విమర్శలను రాజకీయ కోణంలో కాకుండా సామాజిక న్యాయం(Social Justice), ప్రజాధనం వినియోగం, బీసీల దీర్ఘకాలిక ప్రయోజనాల కోణంలో పరిశీలించాలి. బీసీలకు ఆత్మగౌరవ భవనాలు అవసరం. అయితే, అవి కేవలం నిర్మాణాలుగా మిగిలిపోకుండా విద్య, ఉపాధి, శిక్ష ణ, సామాజిక చైతన్యం, యువత అభివృద్ధికి కేంద్రాలుగా మారాలి.
ఈ లక్ష్యాన్ని సాధించే విధంగా ప్రభుత్వ నిర్ణయాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భవనాల విషయంలో తాజాగా విడుదలైన జీవో నంబర్ 14ను కేవలం ప్రభుత్వ పెత్తనంగా చిత్రీకరించడం సరైన రాజకీయ దృక్పథం కాదు. ప్రభుత్వ భూముల్లో ప్రజాధనంతో నిర్మించే భవనాల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం, నిధుల సక్రమ వినియోగం(Proper utilization of funds) ఉండాలని కోరుకోవడం తప్పా? ఒక కుల సంఘానికి కేటాయించిన భూమి, భవనం ఆ సంఘానికే పరిమితం కాకుండా, ఆ సామాజిక వర్గంలోని పేద విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, మహిళలకు, సామాజికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉపయోగపడాలి.
ఇందుకోసం స్పష్టమైన నిర్వహణ విధానం అవసరం. ప్రభుత్వ పర్యవేక్షణ అంటే బీసీల హక్కులను హరించడం కాదు. అది ప్రజాధనంతో ఏర్పడే ఆస్తులపై బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంగా కూడా చూడాలి. అలాగని ప్రభుత్వ పర్యవేక్షణ పేరుతో కుల సంఘా ల ప్రతినిధుల భాగస్వామ్యం తగ్గకూడదు. భవనాల నిర్వహణలో సంబంధిత సంఘాలకు తగిన ప్రాతినిధ్యం, నిర్ణయాధికారం ఉండాలి. ఇదే.. జీవో 14 అమలులో పాటించాల్సిన ప్రజాస్వామిక సూత్రం.
రాజకీయ వేదికలుగా మారొద్దు!
నవంబర్ 5న కాంగ్రెస్ ప్రభుత్వం 38 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి రూ.88.50 కోట్లను కేటాయించడం స్వాగతించాల్సిన పరిణామం. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, అనుమతుల కో సం సింగిల్ విండో విధానం, ప్రతి నెలా పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం నిర్మాణాలను వేగవం తం చేసే చర్యలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టంగా చెప్పిన అంశం ఏమిటంటే కేటాయించిన భూములను వెనక్కి తీసుకునే ఉద్దేశం ప్రభుత్వా నికి లేదు.
భవనాలు విద్యార్థుల వసతి, గ్రంథాలయాలు, నైపుణ్యాభివృద్ధి(Skill Development), సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడాలని ప్రభుత్వం కోరుతోంది. ఇది బీసీ సమాజానికి ఉపయోగపడే దిశగా ఆలోచించాల్సిన అంశం. బీసీ ఆత్మగౌరవం అంటే కేవలం ఒక భవనం నిర్మించడం కాదు. కుల సం ఘాల నాయకులు ఆర్థికంగా బలపడడం, ప్రతి బీసీ కుటుంబానికి విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గౌరవం లభించినప్పుడే నిజమైన ఆత్మగౌరవం సాధ్యమవుతుంది.
అయితే కొన్ని కుల సంఘాలు ఆత్మ గౌరవభవనాల పేరుతో కోట్లాది రూపాయలు కలెక్షన్స్ చేసుకొని నిర్మించుకొని ఇష్టారాజ్యంగా వ్యాపారాలు కొనసాగించే ప్రయ త్నం చేస్తున్నారు. ఇంకా కొందరు వసూ లు చేసిన కోట్లాది రూపాయలకు జవాబు చెప్పకుండా తిష్ట వేసుకొని నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా తన ధనబలంతో, కండ బలంతో కులానికి, జాతికి ఆ భవన స్థలాలకు సంబంధం లేనట్టుగా విర్రవీగుతు న్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 14 ఐక్యతకు దారి చూపిందంటే అతిశయోక్తి కాదు.
ప్రభుత్వం ఏదై నా మంచి ఉద్దేశంతో ఆయా కులాలు, వారి జాతికి దక్కాల్సిన గౌరవం ట్రస్ట్ పేరుతో, గుప్పెడు మంది చేతుల్లో ప్రభు త్వం ఇచ్చిన ఆత్మగౌరవ స్థలాలపై పెత్తనం చేస్తూ, రాజకీయ వేదికలుగా మార్చడానికి అలవాటుపడ్డ ముఠాలకు రేవంత్ ప్రభు త్వం ఇచ్చిన జోవో 14 మింగుడుపడడం లేదు. ఈ భవనాలు జాతిలోని ప్రతిబిడ్డ గర్వపడే విధంగా దోహదపడాలి తప్ప, బీసీ భవనాలు రాజకీయ వేదికలు మా త్రం కాకూడదు.
ప్రభుత్వంతో కలిసి సాగాలి!
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 41 భవనాల కు 87 ఎకరాల 30 గుంటల భూమి కేటాయించింది. రూ.95.25 కోట్ల నిధులు మంజూరు చేసింది. కానీ, వాటి నిర్మాణాలు, నిధుల కేటాయింపులు అన్ని సం ఘాలకు జరగలేదు. అయితే గత ప్రభు త్వం భూములు కేటాయించిందని చెప్పుకోవడం మాత్రమే సరిపోదు. అవి ఎంత వరకు నిర్మాణాలుగా రూపుదిద్దుకున్నా యి? ఎన్ని భవనాలు పూర్తయ్యాయి? ఎన్ని అసంపూర్తిగా ఉన్నాయి? నిధులు ఎన్ని ఖర్చయ్యాయి? అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు అవసరం.
అటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 14పై కుల సంఘాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏమిటో అర్థం కావడంలేదు. కార్పొరేట్ విద్యా సంస్థలకు లీజు ఇవ్వడంతో ఒక కులానికి చెందిన మేధావుల సంఘం హైకోర్టులో కేసువేయడం, దోహదపడే విధంగా జీవో 14 విడుదల చేసింది. ఇక బీఆర్ఎస్ మాత్రం జీవోను రద్దు చేయాలని కులసంఘాల సీజనల్ నాయకులను ఎగదోస్తున్నది. కులసంఘానికి ఉపయోగం లేకుండా లీజులకు ఇచ్చే గలీజు పనులకు చెక్ పెట్టడం మింగుడుపడడం లేదు.
మహా నగరంలోని వ్యాపారు లు, ఆయా కులసంఘాలకు పెత్తందారులుగా నలుగురు కూర్చొని గ్రామీణ నాయ కత్వం రాకుండా గిరిగీసికొని బతుకుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి సంబంధించి, బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్ల అంశం, విద్యా, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక స్వావలంబనతో పాటు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కూడా సమగ్ర బీసీ అభ్యున్నతికి పాటు పడుతూ, బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని రాజకీయ వ్యతిరేకతతో అడ్డుకోవడం కూడా సమంజసం కాదు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు చేయా లి. బీసీ సంఘాలు తమ హక్కులను కాపాడుకుంటూనే ప్రభుత్వంతో కలిసి నిర్మాణా ల పూర్తి, నిర్వహణలో భాగస్వాములు కావాలి. అయితే మంజూరైన భవనాల నిర్మాణాలను పూర్తి చేయడం కూడా ప్రస్తుత ప్రభుత్వ బాధ్యతే.
జీవోను వ్యతిరేకిస్తే ఒరిగేదేంటీ?
జీవో 14ను ఒక రాజకీయ ఆయుధంగా మార్చడం వల్ల బీసీ సమాజానికి ఒరిగేదేమీ లేదు. ఈ జీవో వల్ల పారదర్శకత పెరిగితే, నిర్మాణాలు వేగవంతమైతే, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటే, బీసీ విద్యార్థులకు కొత్త అవకాశాలు కల్పిస్తే ఆ నిర్ణయం సత్ఫలితాలనిస్తుంది. అందు లో పేద బీసీ విద్యార్థులకు వసతి, స్టడీ సెంటర్లు. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ. డిజిటల్ గ్రంథాలయాలు, పరిశోధనా కేం ద్రాలు. మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ.
యువతకు ఉపాధి, స్వయం ఉపాధి మార్గదర్శకత్వం, కులవృత్తులు, సంప్రదాయ కళలు, సంస్కృతి పరిరక్షణ, బీసీ హక్కులు, రాజ్యాంగం, సామాజిక న్యాయంపై అవగాహన లాంటి కార్యక్రమాలు అమలైతే ఆత్మగౌరవ భవనాలు బీసీల భవిష్యత్తుకు పునాదులవుతాయి. అయితే ఆత్మగౌరవం పేరుతో నిర్మించే భవనాలపై బీసీ సంఘా ల హక్కులు, భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యమైనవి. ప్రభుత్వం వాటిని కాపాడాలి. బీసీల భవనాలు ఎవరి రాజకీయ విజయానికి చిహ్నాలుగా కాకుండా, బీసీ సమాజ భవిష్యత్తుకు బంగారు బాటలుగా నిలవాలి.
గతంలో ఎవరు భూములు కే టాయించారు, ఇప్పుడు ఎవరు నిధులు మంజూరు చేస్తున్నారనే రాజకీయ లెక్కలకు మించి, జీవో 14 అమలులో పారద ర్శకతకు పెద్దపీట వేస్తూ, కుల సంఘాల హక్కులు, భాగస్వామ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత. విమర్శలకు భయపడకుండా, బీసీ సంఘాల సూచనలను స్వీకరి స్తూ, ఇచ్చిన హామీలను గడువులోగా నెరవేర్చినప్పుడే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల విశ్వాసాన్ని మరింత చూరగొంటుంది. బీసీల ఆత్మగౌరవం రాజకీయ నినాదం కాకూడదు.
అది ఆచరణలో కనిపించాలి. భవనాలు నిర్మించడం ఒక అడుగు. బీసీ తరతరాల భవిష్య త్తును నిర్మించడం అసలైన లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో జీవో 14 ఒక సాధనంగా నిలవాలి. అందుకే బీసీల ఆత్మగౌర వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలి. రాజకీయ విమర్శలకు అభివృద్ధితోనే సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం
విభాగాధిపతి, 9866255355