నిమోనియాను నివారిద్దాం
నేడు ప్రపంచ నిమోనియా డే :
కరోనా(Corona) అనంతరం నిమోనియా(న్యుమోనియా)తో(Pneumonia) బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు(Medical Experts) సూచిస్తున్నారు. నిమోనియా ఊపిరితిత్తులకొచ్చే(Pneumonia Lung) ఒక అంటువ్యాధి. ఊపిరితిత్తుల్లో(lungs) అల్వియోలీ అనే చిన్నచిన్న గదులుంటాయి. మనం పీల్చుకునే గాలి వీటిలోకి చేరుతుంది. నిమోనియా సోకితే ఈ గదుల్లో వైరస్ చేరి ద్రవపదార్థం తయార వుతుంది. తద్వారా గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. గాలి గదులు వాపు ఎక్కుతాయి. దగ్గు, జ్వరం, ఊపిరితిత్తుల్లో నొప్పి, చలి, అలసట లాంటివి అస్వస్థతలు కలుగుతాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏటా 450 మిలియన్ (45 కోట్లు)మంది ప్రజలు నిమో నియా బారిన పడుతుండగా, అం దులో 4 మిలియన్ల (40 లక్షలు) మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులలో వచ్చే అతి పెద్ద వ్యాధి ఇదే. 2017 గణాంకాల ప్రకారం 8,08,694 మంది 5యేండ్ల లోపు చిన్నారులు మరణించారు.
ఇది ఆ వయస్సు పిల్లల మొత్తం మరణాలలో 15 శాతం. 2019లో ప్రపంచవ్యాప్తంగా నిమోనియా కారణంగా సు మారు 25 లక్షల మంది మరణించారు. పిల్లలు, వృద్ధులకు ఇమ్యూనిటీ తక్కు వగా ఉండడం వల్ల వీరికి ఈ వ్యాధి త్వరగా అంటుకునే అవకాశం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నపిల్లల్లో రెస్సిరేటర్ సిన్సిషియల్ వైరస్(ఆర్ఎస్వీ), పెద్దవారిలో ఇన్‌ఫ్లూయోంజా వైరస్ వలన వచ్చే జలుబు, దగ్గు.. నిమోనియాకు దారితీస్తుందంటున్నారు.
నిర్మూలనే లక్ష్యంగా..
నిమోనియాను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో నిమోనియాకు వ్యతిరేకంగా గ్లోబల్ కోయలిషన్ 2009 నవంబర్ 12న మొదటిసారిగా ప్రపంచ నిమోనియా డేను నిర్వహించింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది జరుపుతున్నారు. న్యుమోనియా గురించి అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. 2026సంవత్సరానికి ప్రపంచ న్యుమోనియా దినోత్స వాన్ని ‘పిల్లల మనుగడ’ అనే థీమ్‌తో జరుపుతున్నారు.మరొక నివేదిక ప్రకారం ‘శ్వాసను తిరిగి తీసుకురావడం: ప్రతి శ్వాస ముఖ్యం’ అనే నినాదంతో కేంద్రీకరించబడింది.
ఇంట్లోనే పరీక్ష!
ఎక్స్-రే, రక్త పరీక్ష, కఫ పరీక్ష, చెస్ట్ సీటీ స్కాన్, బ్రోంకోస్కోపీ వంటి పరీక్షలతో నిమోనియాను నిర్ధారించవచ్చు. ఇంట్లో కూడా టెస్ట్ చేసుకునే అవ కాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ను పల్స్ ఆక్సిమీటర్‌తో గుర్తించవచ్చు. పల్స్ ఆక్సిమీటర్ మన రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను లెక్కిస్తుంది. నిమోనియా కారణంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. చిన్నతనంలో ఇచ్చే బీసీజీ, నిమోకోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చిన్నారుల్లో దీన్ని నివారించవచ్చు. బిడ్డకు ఆరు నెలల వరకూ తల్లిపాలు ఇవ్వడం, శుభ్రత పాటించడం వలన చిన్నారుల్లో నిమోనియా రాకుండా నివారించవచ్చు.
ఆల్కహాల్, స్మోకింగ్ మానేయాలి
ధూమపానం, మద్యపానాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. రోజు వ్యాయామం చేయడం మంచిది. పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటే వ్యాధినిరో ధక శక్తి పెరుగుతుంది.అదే విధంగా చలి కాలంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాణాసంచాకు దూరంగా ఉంటే మరీ మంచిది.అదే విధంగా పీసీవీ వంటి టీకాలను అందుబా టు లోకి తీసుకురావాలి. దీని గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. పాఠ శాలల్లో చిన్నారులకు పరిశుభ్రతపై టీచర్లు అవగాహన కల్పించాలి.
కామిడి సతీష్ రెడ్డి
వ్యాసకర్త సెల్: 9848445134