ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ కట్టడాలు సహించం
సర్కారు భూముల పరిరక్షనే ధ్యేయంగా పనిచేస్తాం
కాప్రా తహసిల్దార్ మతిన్ హెచ్చరిక
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ కట్టడాలు సహించబోమని త్వరలోనే అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని కాప్రా తాసిల్దార్ మతిన్(Capra Tehsildar Mateen) హెచ్చరించారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(Malkajgiri Municipal Corporation) పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని సర్కారు భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరిగాయనే సమాచారం మేరకు గురువారం కాప్రా తహసిల్దార్ మతిన్ ఆదేశాల మేరకు గిర్ధవార్ సత్యనారాయణ సమక్షంలో పలు అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
సర్వేనెంబర్లు 600, 611, 696, 821 లోని వికలాంగుల కాలనీ, బీరప్ప గడ్డ, మోహన్ రావు కాలనీలోని అక్రమంగా వెలిసిన నిర్మాణాలను జెసిబి సాయంతో కూల్చి వేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మతిన్ మాట్లాడుతూ జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని కబ్జాదారులు అక్రమ కట్టడాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సర్కారు భూములను అమాయక పేదలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులపై ప్రత్యేక నజర్ పెట్టామని త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల రక్షనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జవహర్ నగర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ కట్టడాలు చేపట్టరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.