ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై నేడు ప్రజాభిప్రాయ సేకరణ

20-11-2026 | 12:09am

వీర్లపాలెం వద్ద ఏర్పాట్లు చేసిన అధికారులు

దామరచర్ల: దామరచర్ల మండలం(Damaracharla Mandal) వీర్లపాలెం సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఇథనాల్ పరిశ్రమపై శుక్రవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం(Referendum program) నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుండి పరిశ్రమ ఏర్పాటుపై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు.రూ.750 కోట్ల వ్యయం తో 108 ఎకరాల విస్తీర్ణంలో సోహమ్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థ(Soham Agro Industries Company) ఈ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రోజుకు 600 కిలోలీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో పాటు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ కూడా ప్రతిపాదించారు.

ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు రవాణా, వ్యాపార రంగాలకు ప్రోత్సాహం లభించవచ్చు. పరిశ్రమకు అవసరమైన ధాన్యం, మొక్కజొన్నల ను స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేస్తే వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పడుతుంది.అటవీ ,వన్యప్రాణులు, జలవనరులు ,  ప్రజల ఆరోగ్యం పై పడే ప్రభావం విషయంలో పరిశ్రమ వారు తప్పుడు నివేదిక ను రూపొందించినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.పరిశ్రమ ఏర్పాటు పై ప్రజల్లో నెలకొన్న ఆయా అనుమానాలను అధికారులు నివృత్తి చేయాల్సివుంది

మరిన్ని వార్తలు